Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వాతావరణం పరిస్థితులు తట్టుకునే రకంతో సాగు చేయండి

విశాలాంధ్ర- పెద్దకడబూరు : వాతావరణ పరిస్థితులు తట్టుకునే రకంతో పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో ఉప్పరి రఘు తన ఎకర పొలంలో ఈ సంవత్సరంలో రవి హైబ్రీడ్ సీడ్స్ కొత్త మిరప మంజీరా – 646 రకం నాటారు. దీంతో వాతావరణం పరిస్థితుల కారణంగా మిరప పంట అత్యధిక కాపు వచ్చిందని కంపెనీ అధికారులు రైతు ప్రదర్శన నిర్వహించి, రైతును సన్మానించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు శివ, గురు, దత్తాత్రేయ, ఫర్టిలైజర్స్ ఏజెన్సీ ప్రతినిధి సురేష్, డీలర్లు నరసింహా, శరత్, చాంద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img