Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వీక్లీ బెస్ట్ అవార్డు అందుకొన్న పీసీ పెద్దయ్య

విశాలాంధ్ర.. పెద్దకడబూరు : పెద్దకడబూరు పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పెద్దయ్య గురువారం జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ చేతుల మీదుగా వీక్లీ బెస్ట్ అవార్డును అందుకొన్నారు. ఇటీవల మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో ఆస్తి కోసం మద్యం మత్తులో భార్య శాంతి, అత్త లక్ష్మిలను అతి కిరాతకంగా నరికి చంపిన కురువ కరెంటు నాగరాజును అరెస్టు చేయడంలో కానిస్టేబుల్ పెద్దయ్య పని తీరును జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ మెచ్చుకొని వీక్లీ బెస్ట్ అవార్డును ప్రధానం చేశారు. అవార్డు అందుకొన్న పెద్దయ్యను పలువురు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img