Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

వైభవంగా వీర బ్రహ్మేంద్ర స్వామి ద్వజస్థంభ ప్రతిష్ట

విశాలాంధ్ర- పెద్దకడబూరు : మండల పరిధిలోని కంబలదిన్నె గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి ద్వజస్థంభ, గోవిందమాంబ, శిలా విగ్రహాల ప్రతిష్ట, నవ విగ్రహాల ప్రతిష్టాపన వేడుకలు బుధవారం ఘనంగా జరిగింది. వేకువజామున 3 గంటల నుంచి ధనుర్ లగ్న యంత్ర ప్రతిష్టాపన, శిలా విగ్రహాల ప్రతిష్టాపన స్వాముల వారికి గంగ పూజ, బిల్వార్చన, పుట్టమన్ను సేకరణ, దీపారాధన, గోపూజ, ధ్వజారోహణము తదితర పూజలను గ్రామ పురోహితులు శ్రీ గురు మఠం శివనాగయ్య స్వాములు, శ్రీ గురు మఠం మల్లికార్జున స్వాముల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా కంది మల్లయ్య పల్లెలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి కూతురు వీరనారాయణమ్మ వంశీకులు ఏడవ తరం శ్రీ మఠం పీఠాధిపతులు వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి జేష్ట పుత్రుడు కాబోయే పీఠాధిపతి వెంకటాద్రీ స్వామి, వారి ధర్మ పత్ని ఉమాదేవి స్వాముల వారిని అశేష భక్తివాహిణి నడుమ పురవీదుల గుండా ఊరేగించి గ్రామస్తులు, భక్తులు స్వాగతం పలికారు. అనంతరం వారి చేతుల మీదుగా విగ్రహాలకు నైవేద్యములు సమర్పించి ధ్వజారోహణము చేశారు. విగ్రహాల ప్రతిష్టలకు ముఖ్య అతిథులుగా వైసీపీ రాష్ట్ర యువనాయకులు ప్రదీప్ రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థలదాతలు కురువ పెద్ద శీలప్ప, చిన్న ఈరన్న, గ్రామ పెద్దలు మారెన్న, నరసప్ప, ఈరన్న, భీమన్న , అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img