Friday, April 19, 2024
Friday, April 19, 2024

శాతనకోట దళిత కాలనీలో డ్రైనేజీతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.

పట్టించుకోని పాలకులు, అధికారులు

విశాలాంధ్ర..నందికొట్కూరు : నందికొట్కూరు మండలం శాతనకోట గ్రామంలోని దళిత బీసీ కాలనీలలో గత కొన్ని నెలల నుంచి డ్రైనేజీ కాలువలు మురుగునీరుతో నిల్వ ఉండడంతో కాలనీలోని ప్రజలు దుర్వాసన భరించలేక రోగాల బారిన పడాల్సి వస్తుందని గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ కాలనీ ప్రజలు శనివారం విలేకరులకు తెలియజేశారు. పలుమార్లు అధికారులకు, పాలకులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోవడంలేదని వాపోయారు. గత కొన్ని నెలల నుంచి డ్రైనేజీ కాలువలు నిండి సిసి రోడ్లపై ప్రవహిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం చాలా దారుణం అన్నారు. దీంతో ఎండ పొద్దున దుర్వాసన ఎక్కువ రావడంతో కాలనీకి చెందిన ప్రజలు అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి దళిత, బీసీ కాలనీలలో కాలువలలో ఉన్నటువంటి డ్రైనేజీని తొలగించి ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img