Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

శ్రీశ్రీశ్రీ జగద్గురు మౌనేశ్వర స్వామి పంచమ ( 5 ) సంవత్సర మహోత్సవం


విశాలాంధ్ర-పెద్దకడబూరు : మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ జగద్గురు మౌనేశ్వర స్వామి పంచమ వార్షిక జాతర మహోత్సవం స్వస్తి శ్రీ శాలివాహన శకము 1944 శ్రీ శుభకృత్ నామ సంవత్సరము మాఘ మాసము శుద్ధ త్రయోదశి శుక్రవారం ఘనంగా జరిగింది. ఉదయం 5 గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకంలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 8-00 గంటలకు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పతాక ఆవిష్కరణ ఉప్పరహోసళ్ళి శ్రీ నాగలింగస్వామి మఠం శ్రీసూరేంధ్ర స్వామిచే జరిగింది. ఉదయం 11 గంటలకు మహా మంగళహారతి, అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయంత్రం 4 నుండి 6-15 నిమిషాల వరకు స్వామివారికి బాజాభజంత్రీలు , కళశాలు , భజన బృందం వారిచే పల్లకిసేవ నౌలేకల్ గ్రామోత్సవం తిరిగి మౌనేశ్వరస్వామి దేవాలయంనకు ఊరేగింపుగా చేరింది. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ జయలక్ష్మీ, గ్రామ సర్పంచ్ పల్లవి నరేష్ కుమార్ గౌడ్, వైస్ సర్పంచ్ హనుమప్ప వైసీపీ నాయకులు మానప్ప, బసవరాజు, హనుమంతు, అంజినయ్య, నాగరాజు, కాశీం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img