Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

శ్రీ మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు

విశాలాంధ్ర- పెద్దకడబూరు :మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ మల్లికార్జునస్వామికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి బసవరాజు స్వామివారికి ఆకుపూజ, జలాభిషేకము, కుంకుమార్చన, పంచామృతాభిషేకం వంటి ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యములు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img