Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం..

విశాలాంధ్ర -ఆస్పరి : మండల కేంద్రంలో పది పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.
మండల వ్యాప్తంగా 660 మంది విధ్యార్థులకు గాను 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
జడ్పీ హైస్కూల్లో ఏర్పాటుచేసిన ఏ సెంటర్ లో 280 మంది విద్యార్థులకు గాను 278 మంది విద్యార్థులు, బి సెంటర్ లో 225 కు గాను 223 మంది విద్యార్థులు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన సి సెంటర్ లో 215 కు గాను 214 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంకా ఐదు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదని పరీక్ష కేంద్రాల ఇన్విజిలేటర్స్ సుజాత, వెంకటరమణ, హనుమంతులు తెలిపారు. గతంలో 11 పరీక్షలు ఉండగా, ఈసారి 6 పరీక్షలకు కుదించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు ఉండటంతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు 9 గంటల లోపే చేరుకున్నారు. వారికి కేటాయించిన గదులను హాల్ టికెట్ల వారీగా నోటీస్ బోర్డులపై అంటించగా విద్యార్ధులు గుమి కూడి వేతుకులాడుకున్నారు. పరీక్షల నిర్వహణ సిబ్బంది పరీక్షా కేంద్రాల ద్వారాల వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. విద్యార్థులతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి కనిపించింది. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేశారు. విద్యార్థుల‌కు ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద అన్ని వ‌స‌తులు క‌ల్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img