విశాలాంధ్ర, పెద్దకడబూరు ; పెద్దకడబూరు కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న మెడికల్ ఆఫీసర్ ఎస్.శాంతి జ్యోతి తన సొంత నర్సింగ్ హోమ్ పై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ వైద్యశాలపై లేదని అటువంటి వైద్యురాలను తక్షణమే సస్పెండ్ చేసి ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆనంద్ రాజ్, ఫోరం ఫర్ ఆర్టిఐ జిల్లా కార్యదర్శి బొగ్గలు తిక్కన్న,జంపన్న డిమాండ్ చేశారు. సోమవారం ఆదోని డివిజన్ కేంద్రంలో సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కు వైద్యురాల నిర్వాకం పట్ల వినతి పత్రం సమర్పించారు. మండలంలో 35 వేల మందికి పైగానే ప్రజలు జీవిస్తున్నారని సరైన వైద్యం అందక అనారోగ్యం పట్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని సబ్ కలెక్టర్ ముందు వాపోయారు. దినసరే కూలీతో పని చేసే కార్మికులు దీర్ఘకాలిక వ్యాధులకు వేలకు వేలు ప్రైవేట్ వైద్యం పొంది వలస బాట పడుతున్న ఘటనలో జరుగుతున్నాయన్నారు. సక్రమంగా విధులు నిర్వహించని వైద్యురాలు మాకు వద్దు అంటూ ఖరాఖండిగా సబ్ కలెక్టర్కు తెలియజేశారు. ఇకమీదట అనారోగ్యంతో రోగులు ప్రాథమిక వైద్యశాలలో చేరి సరైన వైద్య మందగా ఎవరైనా మరణిస్తే ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత అంటూ ఆగ్రహ వ్యక్తం చేశారు. మంచి డాక్టర్ను నియమించి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రత్నం బాబు, దేవదాస్,జానకమ్మ,ఆంజనేయ,రామయ్య తదితరులు పాల్గొన్నారు.