విశాలాంధ్ర – పెద్దకడబూరు : : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామ శివారులో వెలసిన శ్రీ పాతూరు ఆంజనేయస్వామి ఆలయంలో నూతనంగా విగ్రహాల ప్రతిష్ట మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని సాలె పుష్పవతి, నాగరాజు దంపతులు శివలింగం, నందీశ్వరుడు, మహాగణపతి విగ్రహాలను చేయించి ఆలయ పెద్దలకు విరాళంగా అందజేశారు. దాతలు చేయించిన విగ్రహాలను గ్రామ పురవీదుల గుండా కళసాలతో, మేళతాలతో ఊరేగింపుగా శ్రీ పాతూరు ఆంజనేయస్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లారు.