Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

మండలానికి రెగ్యులర్ విద్యుత్ శాఖ ఏఈని నియమించాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : పెద్దకడబూరు మండలానికి రెగ్యులర్ విద్యుత్ శాఖ ఏఈని నియమించాలని సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో రెగ్యులర్ విద్యుత్ శాఖ ఏఈ లేకపోవడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంచార్జీగా మంత్రాలయం మండలం ఏఈగా గోవిందును నియమించడం జరిగిందన్నారు. ఆయన ఎప్పుడు మండలానికి వస్తాడో తెలియదని, ప్రజలు మాత్రం సమస్యల పరిష్కారానికై మండలానికి వస్తే ఆయన ఎక్కడుంటాడో తెలియని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రైతులకు పగటిపూట విద్యుత్ సరఫరా చేయాలంటూ ఎన్నో సార్లు ఉద్యమాలు చేపట్టినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. దానికి కారణం మండలంలో ఏఈ గోవిందు పని తీరు సరిగ్గా లేదని రైతులు వాపోతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే రెగ్యులర్ విద్యుత్ శాఖ ఏఈని నియమించాలని, రైతులకు పగటిపూట విద్యుత్ సరఫరా చేయాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img