విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : విధులకు డుమ్మా కొట్టిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలంటూ బుధవారం రాయలసీమ అభ్యుదయ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ మహేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి ఖాజా మాట్లాడుతూ మండల పరిధిలోని బసలదొడ్డి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు విధులకు డుమ్మా కొట్టి ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జిల్లా కేంద్రానికి మరియు మండల కేంద్రానికి దూరంగా ఉన్న మారుమూల గ్రామాలలో ఉపాధ్యాయులు విధులకు సరిగా హాజరు కావడం లేదని ఆరోపించారు. వీరిపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకొని విద్యార్థులకు చదువు చెప్పకుండా వారి ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నబిసాబ్, వీరాంజి తదితరులు పాల్గొన్నారు.