విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మంత్రాలయం మండల పరిధిలోని రచ్చుమర్రి గ్రామ సమీపంలో ఉన్న ఆదర్శ పాఠశాల బాలికల హాస్టల్లో సుంకేశ్వరి గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థిని కురువ పార్వతి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని పెద్దకడబూరు మాజీ ఎంపిపి రఘురామ్ డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దకడబూరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కురువ పార్వతి ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో అధికారులు విచారణ జరిపించాలన్నారు. విచారణలో దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. పార్వతి కుటుంబానికి ప్రభుత్వం 20 లక్షల పరిహారం ఇచ్చి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.