విశాలాంద్ర- కర్నూలు సిటీ: ప్రకటనదారులు, ఏజెన్సీలు తమ బకాయిలను వెంటనే చెల్లించాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఏ.భార్గవ్ తేజ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. రెండు రోజుల్లో బకాయిలు చెల్లించకుంటే హోర్డింగుల తొలగింపుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 14 ఏజెన్సీలు, 8 సినిమా థియేటర్ల నుంచి రూ.1,69,30,196 కోట్ల బకాయిలు నగరపాలకకు రావాల్సి ఉన్నాయని కమిషనర్ పేర్కొన్నారు.