Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏఐవైఎఫ్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి

విశాలాంధ్ర -ఆస్పరి : నెల 31వ తేదీన కర్నూలులో నిర్వహిస్తున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సదస్సు వాల్ పోస్టర్లను ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో వైయఫ్ నాయకుల చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి, సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి లు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాయ మాటలు చెప్పి అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి ఇంటికి పంపించారని వారు మండిపడ్డారు. రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖల్లో పోస్టులు మొత్తం భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, అయితే అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాలు గడుస్తున్న కేవలం ఒక్క సంవత్సరం కూడా జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని, రాష్ట్ర ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటు అన్నారు. కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్లో కోసం ఉద్యమకారాచరణ రూపొందించడానికి ఈనెల 31వ తేదీన శుక్రవారం కర్నూలు లోని సి క్యాంపులోని టీజీవి లలిత కళాపరిషత్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఈ సదస్సులో నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి, ఏఐవైఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి రంగప్ప, ఏఐఎస్ఎఫ్ మండల సహాయ కార్యదర్శి రెవన్, ఏఐవైఎఫ్ నాయకులు రామాంజనేయులు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img