Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో రాణించాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని హులికన్వి గ్రామంలో వెలసిన శ్రీరామనవమి, శ్రీ గంగాభవానిదేవీ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం కబడ్డీ టోర్నమెంట్ పోటీలను బుధవారం గ్రామ సర్పంచ్ చిన్న మహదేవ, గొర్రెల ఫెడరేషన్ జిల్లా డైరెక్టర్ యల్లప్ప, ఉప సర్పంచ్ తిమ్మన్ప, వైసీపీ నాయకులు బాపులదొడ్డి మహదేవ, రేషన్ డీలర్ తిమ్మప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడాస్పూర్తితో రాణించాలని హితవు పలికారు. కబడ్డీ పోటీలలో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని కోరారు. కబడ్డీ టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన ప్రథమ జట్టుకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తరుపున రూ. 20,116, ద్వితీయ జట్టుకు వైసీపీ నేత మాధవరం రాఘవేంద్రరెడ్డి చేతుల మీదుగా 15,116, తృతీయ జట్టుకు క్రషర్ యజమాని కీ శే సూర్యనారాయణ జ్ఞాపకార్థం రూ. 10,116 అందజేయడం జరుగుతుందన్నారు. కబడ్డీ టోర్నమెంట్ లో మొత్తం 30 జట్లు తలపడనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు ఓబులేషు, బ్రహ్మయ్య, వీరేష్, హెబ్బటం నారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img