Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

భక్తి శ్రధ్ధలతో బక్రీద్ వేడుకలు

పెద్దకడబూరు :మండల పరిధిలోని చిన్నతుంబలం, మేకడోన, కంబలదిన్నె, జాలవాడి, హెచ్ మురవణి, పెద్దకడబూరు తదితర గ్రామాల్లో గురువారం బక్రీద్ వేడుకలు ముస్లిం సోదరులు భక్తి శ్రధ్ధలతో జరుపుకున్నారు. మండల కేంద్రమైన పెద్దకడబూరులో ముస్లింలు జామీయ మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, గ్రామ పురవీదుల గుండా భారీ ర్యాలీ ద్వారా ఈద్గా వద్దకు చేరుకున్నారు. మత గురువు జాకీర్ బక్రీద్ సందేశాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి, అల్లా అడుగు జాడలలో నడవాలని కోరారు. ప్రత్యేక ప్రార్థనలో వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, గ్రామ సర్పంచ్ రామాంజనేయులు పాల్గొని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img