విశాలాంధ్ర, పెద్దకడబూరు :మండల పరిధిలోని వివిధ గ్రామాలలో సోమవారం టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసిస్తూ టిడిపి మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతం అయింది. మండల కేంద్రమైన పెద్దకడబూరులో టీడీపీ నాయకులు ఏసేపు, మల్లికార్జున,మీసేవ ఆంజనేయ, దశరథరాముడు, నరసన్న గ్రామంలోని పురవీదుల గుండా తిరుగుతూ పాఠశాలలను, హోటళ్లు, దుకాణాలను స్వచ్ఛందంగా మూయించారు.ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్, బ్యాంకు అధికారులను బంద్ లో పాల్గొనాలని కోరారు. సమాచారం అందుకున్న ఎస్ఐ మహేష్ కుమార్ టిడిపి మండల అధ్యక్షులు బసలదొడ్డి ఈరన్న, టిడిపి నేతలు ఏసేపు, బాబురావు, మల్లికార్జున, మీసేవ ఆంజనేయ, దుబ్బన్న, జైపాల్, ఇమ్మానియేలు, ఆదాము, హనుమంతులను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు.