Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి

విశాలాంధ్ర – ఆస్పరి : దేశంలో బీజేపీ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ సమైక్యత, సమగ్రత కోసం సమరశీల పోరాటాలకు సమాయత్తం కావాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండీ అంజిబాబు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పాత నారాయణ ప్రైమ్ స్కూల్ ఆవరణంలో సిపిఐ(యం) పార్టీ మండల రాజకీయ శిక్షణ తరగతులను సిపిఎం మండల కార్యదర్శి హనుమంతు అధ్యక్షతన ఆస్పరి, దేవనకొండ మండలాల పరిధిలోనే ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఎన్నికల వాగ్ధానాలకు తిలోదకాలిచ్చి ప్రజలను మరిచారన్నారు. ఒకే దేశం, ఒకే భాష పేరుతో బీజేపీ దేశంలో మతోన్మాదాన్ని రెచ్చ గొడుతూ లౌకికవాదాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రంలో బీజేపీ మద్దతు తెలుపుతూ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని, బూర్జువా పార్టీల బంధాలను ప్రజలు గమనించాలని, రాబోయే ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆవలనిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీ లేని పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల నాయకులు బాలకృష్ణ, రంగస్వామి, రామాంజినేయులు, మల్లేష్, మదు, రవి సీనియర్ నాయకులు రామాంజినేయులు, మానిక్యప్ప, నారసిహులు, రంగప్ప, ఈరన్న, దేవనకొండ సీపీఎం నాయకులు సూరి, చిగలి, చిన్నహోతురు, జోహరాపూరం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img