విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ పెద్ద లక్ష్మమ్మ అవ్వ ఆలయ నిర్మాణానికి గ్రామ పెద్దల సమక్షంలో శనివారం వేద పండితుల మంత్రోచ్ఛరణాలు మధ్య శివరామిరెడ్డి దంపతులచే శివ లింగానికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు శ్రీధర్ స్వామి సమక్షంలో కొబ్బరికాయ కొట్టి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇందులో ఆలయ అర్చకులు నరసింహాచారి, గ్రామ పెద్దలు రామలింగారెడ్డి, కృష్ణమూర్తి, రమాకాంతరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవి చంద్రారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సర్పంచ్ రామాంజనేయులు, పెద్ద నాగన్న, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.