Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

ఘనంగా చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు సోమవారం ఆలయ పెద్దలు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు శేషగిరి జోషి అమ్మవారిని సుందరంగా అలంకరించారు. ఉదయం అమ్మ వారికి జలాభిషేకము, పుష్పాలంకరణ గావించారు. కుల బాంధవులు అమ్మవారి దేవాలయానికి వచ్చి చౌడేశ్వరిదేవి విగ్రహానికి పాలాభిషేకంతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కొలిచే భక్తుల పాలిట కొంగు బంగారంగా అమ్మవారు వెలుగొందుతున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img