Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

మణిపూర్ ఘటనలకు నిరసనగా కదం తొక్కిన క్రైస్తవులు

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మణిపూర్ లో మహిళలపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా ఎంసీపీసి అధ్యక్షులు సీఎస్ఐ రెవరెండ్ పాస్టర్ ముత్తు మనోహర్ బాబు ఆధ్వర్యంలో సోమవారం పెద్దకడబూరులో క్రైస్తవ సోదరులు శాంతిర్యాలీతో కదం తొక్కారు. మణిపూర్ ఘటనకు వ్యతిరేకంగా క్రైస్తవ సోదరుల నినాదాలతో గ్రామ ప్రధాన రహదారి మార్మోగింది. స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు వేలాది మంది క్రైస్తవ సోదరులు, పాస్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ సి ఎం చర్చి ఫాదర్ సంజీవరావు, టిడిపి రాష్ట్ర నాయకులు ఏసేపు, ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా కార్య వర్గ సభ్యులు బొగ్గుల తిక్కన్న, వైసీపీ నాయకులు ముక్కరన్న, సిపిఎం నాయకులు తిక్కన్న, కాంగ్రెస్ నాయకులు లోకేష్ మాట్లాడుతూ దేశంలో స్త్రీ స్వచ్ఛగా నడి వీధుల్లో తిరిగినప్పుడే ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అన్నారు. అల్పసంఖ్యాకులకు, మహిళలకు ఇంకా నిజమైన స్వాతంత్య్రం లభించలేదన్నారు. మణిపూర్ లో క్రైస్తవులపై గత మూడు నెలలుగా జరుగుతున్న మారణహోమం, అత్యాచారాలను, మానబంగాలను అరికట్టడంలో బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. దేశంలోని అల్పసంఖ్యాకుల పట్ల ప్రధాని మోడీ చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. క్రైస్తవులు కన్నెర్ర చేస్తే మోడీ మాడిమసై పోవడం ఖాయమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే మణిపూర్ ఘటనలకు కారకులైన నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు స్వామిదాస్, సామేలు, ప్రేమ్ కుమార్, జైపాల్, జయరాజు, ప్రభుదాస్, దావీదు, ఇమ్మానియేలు, రాజు, రాజేష్, నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img