Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

ఉద్యోగాల సాధనకు రండి కదిలిరండి

జులై 6న జరిగే ధర్నాను విజయవంతం చేద్దాం
విశాలాంధ్ర- కర్నూలు సిటీ : నిరుద్యోగ యువతి,యువకుల్లారా ఉద్యోగాల సాధనకు రండి !కదిలిరండి! జూలై 6న కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదురుగా జరగనున్న ధర్నాను విజయవంతం చేద్దామని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు కారుమంచిలు పిలుపునిచ్చారు. ధర్నా వాల్ పోస్టర్లను మంగళవారం స్థానిక సి ఆర్ భవన్ నందు వారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు కారుమంచిలు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేయాలన్నారు. ఫిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులకి ఫిజికల్ టెస్ట్లు నిర్వహించాలన్నారు పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న యానిమల్ హస్బండరి అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ భర్తీ చేయాలని, గ్రామ సచివాలయాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 20వేల పోస్టులు భర్తీ చేయాలన్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 50వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కళాశాలలో యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. జిల్లాల విభజన నేపథ్యంలో పెరిగిన రెవెన్యూ డివిజన్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గ్రూప్ 1,2 ద్వారా వెంటనే భర్తీ చేయాలని వయోపరిమితిని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సమితి పిలుపుమేరకు జులై 6వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుందని ఈ ధర్నా కార్యక్రమంలో అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొని ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ధర్నాను విజయవంతం చేయాలని వారు నిరుద్యోగులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు బాబయ్య, బీసన్న నగర నాయకులు కృష్ణ,చంటి, రామచంద్రుడు, హుస్సేన్ భాష బాలకృష్ణ, మహబూబ్ బాషా, నబి, కుమార్ రాజా, రాంబాబు, మధు,సురేష్ కుమార్, రామకృష్ణ, జిలాన్ భాష తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img