–ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శరత్ కుమార్
–ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు
విశాలాంధ్ర-ఆస్పరి (కర్నూలు జిల్లా) : విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శరత్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి అయన మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ నిరంతరం విద్యారంగ సమస్యల పైన పోరాడుతుందన్నారు. విద్యారంగ సమస్యల పరిస్కారం కోసం చదువు – పోరాడు అనే నినాదంతో, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఇప్పటివరకు పేద, మధ్యతరగతి విద్యార్థులకు అండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులను సంఘటితం చేస్తూ అనేక పోరాటాలు నిర్వహించి ఎన్నో విజయాలను అఖిల భారత విద్యార్థి సమైక్య సొంతం చేసుకుందని తెలిపారు. ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంతో అటాసంగా చేపట్టడం జరిగిందని, ప్రతి విద్యార్థి ఏఐఎస్ఎఫ్ సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈశ్వర్, మండల నాయకులు మహేష్, కార్తీక్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.