Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

భూ సమస్యలు పరిష్కారానికి కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన సిపిఐ నాయకులు

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండలంలో భూ సమస్యలు పరిష్కారించాలంటూ సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో పెద్దకడబూరు నుంచి బయలుదేరి కర్నూలులో కలెక్టరేట్ ముట్టడించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మునెప్ప సిపిఐ జిల్లా కార్యదర్శి భాస్కర్ యాదవ్ సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో సాగులో ఉన్న రైతులను మండల తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. తహసీల్దార్ అక్రమంగా రైతులపై 145 సెక్షన్ ఇచ్చి రైతులను నానా అవస్థలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ పై చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా తాసిల్దార్ 145 సెక్షన్ కు సహకరించకుండగా వెనక తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు . ఈ కార్యక్రమంలో నాయకులు జాఫర్ పటేల్, తిక్కన్న, నర్సింహులు, గోపాల్, వీరాంజనేయులు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img