Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని 10న సిపిఐ మహాధర్నా

విశాలాంధ్ర- కర్నూల్ సిటీ: టిడ్కో, ఇందిరమ్మ ఇళ్ళను లబ్ధిదారులకు అందించాలని కోరుతూ సిపిఐ నేతృత్వంలోని టిడ్కో గృహాల సాధన సమితి ఆధ్వర్యంలో జులై 10న కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపట్టనున్నట్లు సిపిఐ సీనియర్ నాయకులు కె.జగన్నాథం పేర్కొన్నారు. టిడ్కో గృహాల సాధన సమితి ఆధ్వర్యంలో టిడ్కో, ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని కోరుతూ గత నెల రోజులుగా కొనసాగుతున్న ప్రచార కార్యక్రమాన్ని శనివారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద సీనియర్ నాయకులు కె.జగన్నాథం ప్రారంభించారు.లక్ష్మీ నగర్ శ్రీరామ్ నగర్, గణేష్ నగర్, ఎద్దుల ఈశ్వర్ రెడ్డి నగర్, జొహరాపురం,వన్ టౌన్, బుధవారం పేట,బంగారుపేట, స్వామి రెడ్డి నగర్, తదితర ప్రాంతాలలో ఆటో ప్రచార కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ రాజు విహార్ సెంటర్ అంబేద్కర్ భవనం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడే మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామ చంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్యలు హాజరవుతారన్నారు. లబ్ధిదారులందరూ మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి, సహకార దర్శి మహేష్, కార్యవర్గ సభ్యులు నాగరాజు, అన్వర్, సోమన్న, బిసన్న, కుమార్, బాబయ్య, కృష్ణ, అమినాబి, మౌలాలి, రెహమాన్, రామచంద్ర,వెంకటేష్, రాములు
పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img