విశాలాంధ్ర, పెద్దకడబూరు :తన సొంత నర్సింగ్ హోమ్ కు గర్భవతులను తీసుకెళ్లనందుకు చేయని నేరాన్ని తనకు అంటగట్టి నన్ను విధులకు దూరంగా ఉంచి నా బ్రతుకుతో చెలగాటం ఆడుతున్న వైద్యాధికారిని శాంతిజ్యోతిపై చర్యలు తీసుకోవాలని పెద్దకడబూరుకు చెందిన ఆశావర్కర్ జానకమ్మ జిల్లా ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మేనెల 27వ తేదీన నా క్లస్టర్ పరిధిలో ఉన్న ఐదు మంది గర్భవతులను స్కానింగ్, రక్త పరీక్షల నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సహించని వైద్యాధికారిని శాంతిజ్యోతి తనకు ఫోన్ చేసి ఎవరిని అడిగి గర్భవతులను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లావని నన్ను మందలించడంతో నర్సు ఆదేశాల మేరకు తీసుకొచ్చినన్నారు. దీంతో నన్ను చెప్పరాని బూతులతో ఫోన్లో తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమి తప్పు చేశానని నన్ను తిడుతున్నారని ప్రశ్నిస్తే నాకు నర్సింగ్ హోమ్ ఉంది, గర్భవతులను నా ఆసుపత్రికి తీసుకోరావాలని హుకుమ్ జారీ చేస్తూ బూతులు తిట్టిందన్నారు. నాపై కక్షగట్టి నేను కోడుమూరుకు వెళ్లి లింగనిర్ధారణ పరీక్షలు చేయిస్తానని నాపై నెపం వేసి నన్ను విధులకు దూరంగా ఉంచి జీతం చేయకుండా నా బ్రతుకుతో వైద్యాధికారిని చెలగాటం ఆడుతూ నన్ను మానసిక వేదనకు గురిచేస్తుందని ఆరోపించారు. నా క్లస్టర్ ప్రజలకు నేనెప్పుడూ అందుబాటులో ఉంటున్నాని, వైద్యాధికారిని లేనిపోని ఆరోపణలు చేసి నిందలు మోపడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా నన్ను విధులకు దూరంగా ఉంచి నా బ్రతుకుతో చెలగాటం ఆడుతున్న వైద్యాధికారిని శాంతిజ్యోతిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరారు.