Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 14, 2024
Saturday, September 14, 2024

విద్యుత్ వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : వర్షకాలంలో విద్యుత్ వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ ఏఈ గోవిందు సూచించారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ నందు వినియోగదారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షకాలం ఇంట్లో ఉపయోగించే విద్యుత్ వైర్లు, స్విచ్ లు, హోల్డర్లు తదితర పరికరాలను నాణ్యత కలిగిన వాటిని ఉపయోగించడం వల్ల ప్రమాదాలు నివారించ వచ్చునని తెలిపారు. ప్రతి ఇంటికి వినియోగదారులు తప్పనిసరిగా ఎర్త్ పైపు ద్వారా ఎర్తింగ్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షం పడుతున్నప్పుడు విద్యుత్ స్థంభాలను, స్టే వైర్లను ముట్టుకొనరాదని, తడి చేతులతో, తడి కాళ్లతో స్విచ్ లు వేయరాదన్నారు. విద్యుత్ కు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత విద్యుత్ శాఖ సిబ్బందికి మాత్రమే సంప్రదించాలని, ప్రైవేటు వ్యక్తులను సంప్రదించరాదని తెలిపారు. ఏదైనా విద్యుత్ ప్రమాదం జరిగితే వెంటనే దగ్గరలోని విద్యుత్ శాఖ అధికారికి గానీ సిబ్బందికి గానీ తెలపాలని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారులు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img