Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

గ్రామీణ ప్రాంతాలలో ఉచిత మెడికల్ క్యాంపుల ఏర్పాటుకు ముందుకు రావాలి

విశాలాంధ్ర – కర్నూలు సిటీ : వైద్య రంగంలో ఆధునిక సాంకేతికతో కూడిన విప్లవాత్మకమైన వైద్య సదుపాయాలు వచ్చాయని , గ్రామీణ ప్రాంతాలలో ఉచిత మెడికల్ క్యాంపులను విస్తరింప చేయాలని లయన్స్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో సోమవారం ప్రకాష్ నగర్ లో ఉన్న వి.ఆర్ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వాసిరెడ్డి,జనరల్ ఫిజీషియన్ డాక్టర్ అనూషను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వాసిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించరాదని ఏ జబ్బునైనా ప్రాథమిక దశలో గుర్తించగలిగితే సరైన వైద్యం అందించవచ్చు అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రధాన కార్యదర్శి లయన్ సి.డి గోవర్ధనగిరి ఉపాధ్యక్షులు లయన్ పవన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు లయన్ మోహన్, లయన్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img