Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

కరెంటు చార్జీల దోపిడీని ఆపాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : కరెంటు చార్జీల దోపిడీని ఆపాలంటూ జిల్లా కమిటీ పిలుపు మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వినియోగదారులను నిలువుదోపిడి చేస్తున్నాయని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ చార్జీలు పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారాన్ని జగన్ ప్రభుత్వం మోపిందని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో పాదయాత్ర సమయంలో టిడిపి ప్రభుత్వంలో కరెంటు చార్జీల మోత అధికంగా ఉందని ప్రతిపక్ష నేతగా గగ్గోలు పెట్టారన్నారు. తాను సీఎం అయితే కరెంటు చార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తీరా సీఎం అయ్యాక ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచారని దుయ్యబట్టారు. కరెంటు చార్జీలు తగ్గించేవరకు పోరాడుతామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని లైన్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ రవూఫ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమ్మరి చంద్ర, వీరేష్, శివ, హనుమంతు, శివన్న, రామాంజనేయులు, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img