Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రైతుల సమస్యలు పరిష్కరించడంలో వీఆర్వోలు నిర్లక్ష్యం

విశాలాంధ్ర-పెద్దకడబూరు : మండలంలో రైతుల సమస్యలు పరిష్కరించడంలో వీఆర్వోలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, కమిటీ సభ్యులు రాజు, ఏఐకెఎస్ తాలూకా కార్యదర్శి ఆంజనేయ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని వీఆర్వోలు రైతులు సమస్యలను పరిష్కరించకుండ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లకుండ కార్యాలయంలోనే గడుపుతున్నారన్నారు. భూ రీసర్వేలో సరిహద్దులలో నెంబర్ రాళ్లు ఒకరి పొలంలో వేస్తే మరొకరి పొలంలో వెయ్యడం లేదన్నారు. భూ రీసర్వే సక్రమంగా జరగలేదని, అన్నీ అవకతవకలే ఉన్నాయన్నారు. దీంతో రైతులు పనుల కోసం వీఆర్వోల చుట్టూ తిరిగుతున్నా రని, ఇది అదను చూసుకొని వీఆర్వోలు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లా కలెక్టర్ స్పందించి లంచాలకు పాల్పడుతున్న వీఆర్వోలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తాహశీల్దార్ కార్యాలయంపై విచారణ చేసి తాహశీల్దార్, వీఆర్వోలను సక్రమంగా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటరాముడు, తిక్కన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img