Friday, April 19, 2024
Friday, April 19, 2024

సబ్సిడీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ కు అందజేసే సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేరుశనగ, జీలుగ, పిల్లిపెసర విత్తన పంపిణీ కోసం అన్ని రైతు భరోసా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, విత్తనాలు కావలసిన రైతులు రైతు భరోసా కేంద్రాలవద్ద రిజిస్ట్రేషన్ చేసుకొని సబ్సిడీ మినహాయించి రైతు చెల్లించవలసిన డబ్బులు చెల్లించినట్లయితే ఏపి సీడ్స్ కార్పొరేషన్ నుంచి నేరుగా రైతు భరోసా కేంద్రాలవద్ద విత్తన పంపిణీ జరుగుతుందని తెలిపారు. వేరుశనగ ఒక క్వింటా పూర్తి ధర 9300 రూపాయలు కాగా, 40 శాతం రాయితీ 3720 రూపాయలు మినహాయించి రైతు కట్టవలసినది రూపాయలు 5580 అనగా రాయితీ మినహాయించి 30 కేజీల సంచి 1674 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
జీలుగ ఒక క్వింటా పూర్తి ధర 7900 రూపాయలు కాగా, 50 శాతం రాయితీ 3950 రూపాయలు మినహాయించి రైతు కట్టవలసినది రూపాయలు 3950 అనగా రాయితీ మినహాయించి 10 కేజీల సంచి 395 రూపాయలు, పిలిపెసర ఒక క్వింటా పూర్తి ధర 9700 రూపాయలు కాగా, 50 శాతం రాయితీ 4850 రూపాయలు మినహాయించి రైతు కట్టవలసినది రూపాయలు 4850 అనగా రాయితీ మినహాయించి 8 కేజీల సంచి 388 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img