విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని హెచ్ మురవణి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద రైతులు మజ్జిగ చిన్న హనుమంతు, బోయ గుంటెప్పలకు బుధవారం మంత్రాలయం టిడిపి బీసీ నాయకులు మాధవరం రాఘవేంద్ర రెడ్డి తరుపున టిడిపి యువనేత మాధవరం రామకృష్ణారెడ్డి ఒక్కొక్కరికి 5 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. అధైర్య పడొద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సొంటెన్న, మధు, ఎన్టీఆర్ జంబూలయ్య, జింకల దస్తగిరి, చెన్నకేశవ గౌడ్, అంజినయ్య, మాజీ డీలర్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.