Monday, September 25, 2023
Monday, September 25, 2023

చంద్రబాబుతోనే భవిష్యత్తుకు గ్యారెంటీ

విశాలాంధ్ర, పెద్దకడబూరు :టీడీపీ అధినేత చంద్రబాబుతోనే భవిష్యత్తుకు గ్యారెంటీ అని టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో క్లస్టర్ ఇంచార్జీ, టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ – ఇది బాబు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ టిడిపి అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల గురించి వివరించారు. చంద్రబాబుతోనే పేద, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపిని ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జీ తలారి అంజి, బూత్ ఇంచార్జీ బొగ్గుల నరసన్న, మీసేవ ఆంజనేయ, నాయకులు ఆదాము, జైపాల్, ఇమ్మానియేలు, నాగరాజు, దానియేలు, బుడ్డన్న, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img