Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

కూరగాయల రైతుకు ప్రభుత్వం ప్రోత్సాహం

. మంత్రి గుమ్మనూరు జయరాం
. మంత్రి చేతుల మీదుగా మార్కెట్ ప్రారంభం

విశాలాంధ్ర ఆస్పరి : రైతు బాంధవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూరగాయల సాగు రైతులకు ఎంతో ప్రోత్సాహం కల్పిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. శుక్రవారం మండల కేంద్రం ఆస్పరిలో జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, కూరగాయల మార్కెట్ నూతన కాంట్రాక్టర్ బొల్లూరు అంజనేయులు ఆధ్వర్యంలో సాగే కూరగాయల మార్కెట్ ను మంత్రి గుమ్మనూరు జయరాం, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు, వైకాపా ఆలూరు తాలూకా ఇన్చార్జి గుమ్మనూరు నారాయణస్వామి లు వినాయకుడి చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం మార్కెట్ కు రైతులు తీసుకువచ్చిన వచ్చిన క్యాబేజీ, పచ్చి మిరపకాయలు, చోలేకాయలు, వంకాయలు, బీట్రూట్, టమోటా తదితర కూరగాయల దిగుబడులను పరిశీలించి రైతులను పంటల ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణప్రాంత రైతులు కూడా కూరగాయల సాగుపై మక్కువ చూపుతున్నారని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేలా పంటలు పండిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూరగాయలు సాగు చేసేందుకు రాయితీలు ఇవ్వడంతో అన్నివర్గాల రైతులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అన్ని కాలాల్లో కూరగాయలకు మంచి డిమాండ్‌ ఉండడం కూడా రైతులకు కలిసివస్తున్నారు. నాణ్యమైన దిగుబడులకు మార్కెట్లో ధర తప్పనిసరిగా లబ్ధిస్తుందని, రైతులు కూడా ఆదిశగా మంచి దిగుబడులను మార్కెట్ కు తీసుకువస్తే గిట్టుబాటు వస్తుందన్నారు. రైతులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రాంభీమ్ నాయుడు, మూలింటి శేఖర్, రంగన్న, ఉప సర్పంచ్ నరసప్ప, గోవిందు, ఉలితప్ప, వ్యాపారస్తులు భాస్కర్, రమేష్, సలీం, బిల్లేకల్లు, శీను, సోమశేఖర్, నాగేంద్ర, దబ్బుల వెంకి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img