గోపిక, కృష్ణుడి వేషధారణల్లో ఆకట్టుకున్న చిన్నారులు
పాఠశాలల్లో ఉట్టికొట్టే కార్యక్రమాలు
అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
విశాలాంధ్ర -ఆస్పరి : మండల కేంద్రంలోని నారాయణ ప్రైమ్ స్కూల్ లో గురువారం ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా చిన్నారి విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలబాలికలు చిన్ని కృష్ణుడు, గోపిక, రాధల వేషధారణలతో చూపరులను ఆకట్టుకున్నారు. రాధాకృష్ణుల జీవిత చరిత్రను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు. వెన్నకుండలతో బాలబాలికల హడావుడి ముచ్చటగొలిపింది. పిల్లనగ్రోవితో చిన్నారులు ఆటా పాటలు అందరినీ అలరించాయి. పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థినీ విద్యార్థులు పలు వేషధారణల్లో ఆకట్టుకున్నారు. ఈ సందర్బంగా ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేష్ ఆచారి, ఉపాధ్యాయ బృందం దీప్తి, సతీష్ కుమార్, జోష్ణ, అంజి, ఈశ్వర్, గాయత్రి, రేష్మా, అంజీనమ్మ, పద్మావతీ, శ్రీదేవి, గంగమ్మ విష్ణు సంజన్న, నారాయణ తదితరులు పాల్గోన్నారు.