విశాలాంధ్ర, పెద్దకడబూరు :మండల పరిధిలోని రాగిమాన్ దొడ్డి గ్రామంలో చెడిపోయిన చేతి పంపుకు శుక్రవారం గ్రామ సర్పంచ్ చంద్రకళ యంకప్ప స్వామి ఆధ్వర్యంలో మెకానిక్ పౌలయ్య మరమ్మత్తులు చేశారు. కాలనీ వాసుల సహాయంతో చెడిపోయిన బోర్ ను, పైపులను బయటకు తీయించి కొత్త పరికరాలను అమర్చి మరమ్మతులు చేశారు. అనంతరం చేతి పంపులో నుంచి నీళ్ళు రావడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేసి, సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.