Friday, August 12, 2022
Friday, August 12, 2022

వెంటాడుతున్న రుణమాఫీ గాయాలు

8సం నాటి అప్పు చెల్లించాలంటూ పలువురు రైతులకు నోటీసులు
మాఫీ అయిందంటూ నాడు చెప్పిన అధికారులు
కొలిమిగుండ్ల సొసైటీ తీరుపై ఆందోళన చెందుతున్న అన్నదాతలు


విశాలాంధ్ర కొలిమిగుండ్ల: నాటి రుణమాఫీ గాయాలు కొందరి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.ఎప్పుడో పంటపై రుణం తీసుకున్న రైతులు అప్పుచెల్లించాల్సిందే అంటూ సంబంధిత శాఖ అధికారులు నేడు నోటీసులు పంపడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.నాడు రుణమాఫీ అయిందని చెప్పిన అధికారి నేడు లేకపోవడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలో చిక్కుకున్నారు.2014లో నాడు టీడీపీ అధికారంలోకి బాగానే రైతులు తీసుకున్న పంట రుణాలను దశలవారీగా ప్రభుత్వం మాఫీ చేసిందని రైతులు గుర్తు చేస్తున్నారు.నాడు రు 1.5 లక్ష వరకు మాఫీని దశలవారీగా ప్రభుత్వం చేసిందని, అందులో 50 వేల లోపు ఉన్న రుణాన్ని ఒకేసారి మాపి చేసిందని రైతులు చెపుతున్నారు.రు 50000 వేల లోపు రుణం ఉన్న రైతులందరూ తమ అప్పుఒకే సారి మాపి అయిందని నాడు భావించారు.రుణమాఫీ లిస్ట్ లో తమ పేరు కూడా కనపడటంతో రైతులు అందరూ ఆనందపడ్డారు.అయితే ఇటీవల కొలిమిగుండ్ల ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం అధికారులు నాడు తీసుకున్న పంట రుణాన్ని చెల్లించాల్సిందే అంటూ ఇటీవల సంఘం పరిధిలోని ఆయా గ్రామాల రైతులకు నోటీసులు పంపించారు.నోటీసులు అందుకున్న కొందరు రైతులు లబోదిబోమంటున్నారు. మండల కేంద్రంలోని కార్యాలయానికి పరుగులు తీశారు.ఎనిమిది సంవత్సరాలుగా ఏమాత్రం పట్టించుకోని అధికారులు ఇవాళ ఆకస్మికంగా రైతులకు నోటీసులు పంపించారు.నాడు రుణమాఫీ అయిందని చెప్పిన అధికారి లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నాటి సొసైటీ అధికారి సరైన రికార్డులు మైయింటింగ్ చేయకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లు ఆరోపణలు వెళువెత్తుతున్నాయి.మీర్జా పురం గ్రామానికి చెందిన బొజ్జా రామచంద్రారెడ్డి అనే రైతు సొసైటీ నందు2022లో క్రాప్ లోన్ రెన్యువల్ చేయించుకున్న 2014 నుండి పంట రుణం చెల్లించాలంటూ నోటీసులు పంపించడంతో ఆందోళన చెందుతున్నాడు.అలాగే అదే గ్రామానికి చెందిన పిక్కిలి సుబ్బమ్మ కు 2013 నుండి రుణన్ని చెల్లించాలంటూ నోటిస్ అందజేశారు. నాడుఆమెకు రుణమాఫీ అయిందని చెప్పడంతోపాటు సొసైటీ వారు నోడ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వడంతో ఐదు సంవత్సరాల నుండి బ్యాంకు లో పంట రుణం తీసుకుంటున్నది. మదనంత పురం గ్రామానికి చెందిన కుమ్మెత చంద్రశేఖర్ రెడ్డి కూడా 2014 సంవత్సరం నుండి రుణాన్ని చెల్లించాలని నోటీసులు పంపించారు.రైతు కూడా ఎప్పుడో రుణమాఫీ అయిందని భావించారు.ఇలా సొసైటీ పరిధిలో వందల మంది రైతులకు నోటీసులు పంపించడంతో ఆందోళన చెందుతున్నారు.8,9సంవత్సరాల నుండి సొసైటీ అధికారులు ఎందుకు రుణం పై నోరు మెదపలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.నాటి సొసైటీ అధికారులు ఇష్టనుసారంగా వ్యవహరించి, రికార్డులను కూడా సరిగ్గా మైయింటిన్ చేయకపోవడంతోనే రైతుల ఆందోళనకు కారణమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

కొలిమిగుండ్ల లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img