Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ప్రకృతి వ్యవసాయం ద్వారా అధిక దిగుబడులు

ప్రతి కిట్టులో 14 రకాల విత్తనాలు
61 మంది రైతులకు విత్తనాల కిట్లు పంపిణీ

గ్రామ సర్పంచ్ మరియమ్మ ,వెలుగు ఏపిఎం సుబ్బయ్య

విశాలాంధ్ర -మిడుతూరు: మండల పరిధిలోని చెరుకుచెర్ల గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండిస్తున్న షెడ్యూల్ కులాలకు చెందిన 61 మంది రైతులకు ప్రధానమంత్రి అనుసూచిత జాతీయ అభ్యుదయ పథకం ద్వారా గ్రామ సర్పంచ్ మరియమ్మ , నందికొట్కూరు ఏరియా కోఆర్డినేటర్ డేగలయ్య ఆధ్వర్యంలో బుధవారం విత్తనాలకు కిట్టు పంపిణీ చేశారు .ఈ విత్తనాల కిట్టి నందు 14 రకాల విత్తనాలు ఉంటాయని తెలిపారు . అనంతరం వెలుగు ఏపిఎం సుబ్బయ్య మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంట వలన అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని ,ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించాలని తెలియజేశారు .ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం వస్తుందని తెలిపారు . గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయాలని వారికి సూచించారు .ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, మహిళలు సీసీ కృష్ణారెడ్డి అగ్రికల్చర్ ఎంపీఈవో మౌలాలమ్మ , విహెచ్ఎ మద్దిలేటి ,మాస్టర్ ట్రైనర్ స్వామి, ఐ సి ఆర్ పి లు డోరతి, సరస్వతి ,కిరణ్ కుమారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img