Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

హోరాహోరీగా కూరగాయల మార్కెట్‌ వేలం

ఉమార్కెట్ వేలం 56 లక్షలు

విశాలాంధ్ర -ఆస్పరి : మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణంలో బుధవారం నిర్వహించిన కూరగాయల మార్కెట్‌ వేలం పాట హోరాహోరగా సాగింది. జిల్లా పంచాయతీ అధికారుల ఆదేశాల మేరకు పత్తికొండ డి.ఎల్.పి.ఓ ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో సర్పంచ్ మూలింటి రాధమ్మ అధ్యక్షతన ఈ కూరగాయల మార్కెట్‌ వేలం పాటను నిర్వహించారు. ఈ వేలం పాటలో మొత్తం 5 మంది పాటదారులు పాల్గొనగా వైయస్సార్సీపి మద్దతుదారుడు బొల్లూరు ఆంజినేయులు రూ.56,01,000 లక్షలకు పాట పాడి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా డి.ఎల్.పి.ఓ ప్రకాష్ నాయుడు, జిల్లా కేడిసిసి డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర లు మాట్లాడుతూ మేజర్ గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు కూరగాయల మార్కెట్ వేలం పాటలో వచ్చిన నగదులో 25% అనగా ఊరు వాకిలి నిర్మాణం కోసం రూ.14 లక్షలు కేటాయిస్తున్నామని తెలిపారు. మిగిలిన నగదు రూ.42,01,000 లక్షలు పంచాయతీకి జమ చేస్తామన్నారు. గతంలో కంటే ఈ సంవత్సరం గ్రామపంచాయతీకి 51వేలు అదనంగా ఆదాయం సమకూరినట్లు వారు తెలిపారు. గ్రామ పంచాయతీ నిబంధనల మేరకే వేలం పాటను దక్కించుకున్న కాంట్రాక్టర్‌ నడుచుకోవాలన్నారు. ఈ వేలంపాటలో జడ్పిటిసి దొరబాబు, సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, సీఈఓ అశోక్ నాయుడు, మాజీ ఎంపీపీ రత్నమ్మ భర్త మాజీ డైరెక్టర్ కృష్ణ యాదవ్, టిడిపి మాజీ మండల కన్వీనర్ తిమ్మన్న, ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ సంజన్న, జనసేన నాయకులు అరవింద్, వైసీపీ రెబల్ కట్టెల లక్ష్మీనారాయణ, సిపిఎం నాయకులు రామాంజనేయులు, ఉప సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, పంచాయితీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు, యువకులు పాల్గొన్నారు. ఈ వేలం పాటలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆస్పరి, చిప్పగిరి ఎస్సైలు వరప్రసాద్, రమేష్ బాబు స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ అక్బర్ బాషా, ఇంటెలిజెన్స్ పోలీస్ దినేష్ కుమార్ లు గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img