Monday, September 25, 2023
Monday, September 25, 2023

పంటల బీమాలో రైతులకు అన్యాయం

విశాలాంధ్ర – ఆస్పరి : ఉచిత పంటల బీమా వర్తింపజేయడంలో మండల రైతులకు తీరని అన్యాయం జరిగిందని రైతు సంఘం మండల కార్యదర్శి రంగస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బాలకృష్ణ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉచిత పంటల బీమా అమలులో జరిగిన ఒక అవకతవకతలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్, వ్యవసాయ శాఖ కార్యాలయాల ముందు వేరువేరుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మధు రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ 2022 ఖరీప్‌ సీజన్ లో పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, టమోటా వంటి పంటలు సాగుచేసి రైతులంతా తీవ్రంగా నష్టపోయారన్నారు. ఉచిత పంటల బీమా పథకంలో నష్టపోయిన రైతుకు ఇన్సూరెన్స్ కింద కేవలం 27 రూపాయలు రావడం చాలా దారుణమని, వ్యవసాయ అధికారులు రైతులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేసిందని ధ్వజమెత్తారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్, ఆర్.బి.కె ఎంపీఈఓ లకు వేరు వేరుగా వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున, మహానంది, హనుమంతు, రామాంజనేయులు, రంగన్న, హనుమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img