Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

సాగుకు రూ.10 వేల పెట్టుబడి సహాయం ఇవ్వాలి

విశాలాంధ్ర- ఆస్పరి : తెలంగాణ ప్రభుత్వ తరహాలో ఏపీ ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల ప్రకారం సాగు పెట్టుబడి సహాయం ఇవ్వాలని సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి, పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి, ఉపసర్పంచ్ వెంకటేష్, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి అంగడి వీరేష్ లు డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని ఆస్పరి, కైరిప్పల గ్రామ సచివాలయాల కేంద్రాల ముందు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు అప్పుల్లో కూరుకుపోయారని, సకాలంలో వర్షాలు కురవక, ప్రకృతి సహకరించక, పంటలు దిగుబడి లేక పండించిన పంటలకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర ఇవ్వక ప్రతి సంవత్సరం రైతు నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఉపకరణాలు 90 శాతం సబ్సిడీతో అందించాలన్నారు. కేరళ తరహా చట్టం తేవాలని, 50 సంవత్సరాలు పైబడిన రైతుకు ప్రతినెల పింఛన్ ఇవ్వాలని డిమాండ్లతో జూన్ 26 నుండి జులై 31 వరకు జరుగు దశలవారి కార్యక్రమాలను ప్రతి రైతు భాగస్వామ్యం అయ్యి విజయవంతం చేయాలని కోరారు. మండలంలో నష్టపోయిన రైతులకు పంట బీమా పథకం ఇష్టానుసారంగా ఎకరాకు 500 నుండి 1200 వరకు రాసి రైతులకు తీవ్ర నష్టం చేసిన వ్యవసాయ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు తెలియజేశారు. అనంతరం సచివాలయ కేంద్రాల పంచాయితీ కార్యదర్శులకు వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి ఉరుకుందప్ప, సిపిఐ సీనియర్ నాయకులు బ్రహ్మయ్య, హమాలి సంఘం అధ్యక్షులు హనుమంతు, సంజీవ్, బజారి, జైపాల్, కిష్టప్ప, మహానంది, రంగన్న, శరవన్న, హనుమంతు, శ్రీనివాసులు, హుస్సేనమ్మ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img