Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

జగనన్న సురక్ష.. ప్రజలకు వరం

విశాలాంధ్ర – ఆస్పరి : జగనన్న సురక్ష పథకం ప్రజలకు ఓ వరమని మండల తాసిల్దార్ కుమారస్వామి, ఎంపీడీవో రాణేమ్మ, సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, వైకాపా మండల కన్వీనర్ పెద్దయ్య లు తెలిపారు. గురువారం మండల పరిధిలోనే జొహరాపురం, డీ కోటకొండ గ్రామాలలో మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఆయా గ్రామాల సర్పంచులు నెల్లూరప్ప, బీటీ జయలక్ష్మిల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జగనన్న సురక్షతో కుల, ఆదాయ, ముటేషన్‌ వంటి 11 రకాల ధ్రువ పత్రాలు అందజేస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవోఆర్డి నరసింహారెడ్డి, ఎంపీటీసీలు శ్రీరాములు, అటికెలగుండు రంగమ్మ, వైకాపా నాయకులు బీటీ రంగప్ప, జెడి రంగస్వామి, రామాంజినేయులు, ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు, అల్లిపీరా, శివకోట, ప్రభాకర్ యాదవ్, మేఘనాథ్, వీఆర్వోలు మాబుశుభాన్, హరి, పంచాయతీ కార్యదర్శులు జంప్లానాయక్, సునీల్ బాబు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img