Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 117 రద్దు చేయాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మహానంది డిమాండ్
రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు తల్లిదండ్రులు

విశాలాంధ్ర జూపాడుబంగ్లా : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మహానంది ఆధ్వర్యంలో విద్యార్థులు తల్లిదండ్రులు శనివారం పారుమంచాల గ్రామంలో బస్టాండు నందు రహదారిపై ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మహానంది మాట్లాడుతూ నూతన విద్యా విధానం వల్ల 3,4,5, తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం వల్ల పేద విద్యార్థులు విద్యకు దూరం అయ్యే అవకాశం ఉందని, ఈ విలీనం వలన అనేక పాఠశాలలు మూత పడటానికి కారణం అవుతుందని వారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాల కు మా పిల్లలను పంపమని వారు అన్నారు. గ్రామ మధ్యలో ఉన్న ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత పాఠశాల కు పోవాలంటే మా చిన్నారి పిల్లలకు భద్రత లేదని, గ్రామ మధ్య ఉండే పాఠశాలను ప్రభుత్వం యధావిధిగా పాఠశాలను కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . తల్లిదండ్రులు విద్యార్థులు కలిసి బస్టాండ్ ఆవరణలో రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ నూతనంగా తీసుకొచ్చిన జీవోను రద్దు చేయకపోతే తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహానంది డిమాండ్ చేశారు. అనంతరం గ్రామములో రహదారిపై ధర్నా చేపట్టడంతో రాకపోకలకు అంతరాయం కలగడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ధర్నా చేపట్టిన విద్యార్థులు తల్లిదండ్రులతో వారు మాట్లాడారు. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులకు తెలియ చేస్తామని వారు చెప్పడంతో వారు ధర్నా విరమించారు. అనంతరం ఏ ఎస్ ఐ జయన్న కు వారు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎర్రన్న,ఏసన్న,చిట్టెమ్మ, దానమ్మ,రోజమ్మ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img