విశాలంద్ర- కర్నూల్ సిటీ: కర్నూలు వాసి గద్ద కావ్య శ్రీ కడప రిమ్స్ ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ లో అత్యంత ప్రతిభ కనబరిచి పిడియాట్రిక్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది.ఈ మెడల్ సాధించినందుకు తనకు ఎంతో గర్వాంగా ఉందని , తనకు ప్రోత్సాహాన్ని అందించిన తన ప్రొఫెసర్స్ , తోటి డాక్టర్లకు, తన కుటుంబ సభ్యులకు గద్ద కావ్య శ్రీ శనివారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలియచేశారు.కుటుంబ సభ్యులు ఏసీబీ హెడ్ కానిస్టేబుల్ గద్ద దొరబాబు,
గద్ద శ్రావణ్ కుమార్ లు కావ్య శ్రీ గోల్డ్ మెడల్ సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.