Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

కర్నూల్ లో లలిత జ్యువెలరీ ప్రారంభం

విశాలాంధ్ర- కర్నూల్ సిటీ: తక్కువ ధరలకే నాణ్యమైన బంగారు ఆభరణాలను అందిస్తున్న లలిత జ్యువెలరీ కర్నూల్ లో తన 51వ షోరూంను పార్క్ రోడ్డు లోని మేడం కాంపౌండ్ లో శనివారం అట్టహాసంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లలిత జ్యువెలరీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ కిరణ్ కుమార్, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు అబ్దుల్ హాఫిజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, నగర మేయర్ బి వై రామయ్య, డిప్యూటీ మేయర్లు ఎస్ రేణుక, ఎన్ అరుణ, 13వ కార్పోరేటర్ ఎం విజయలక్ష్మిలు పాల్గొన్నారు.దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలిత జ్యువెలరీ 51 షోరూంను కర్నూలో ప్రారంభించడం ఆనందంగా ఉందని లలిత జ్యువెలరీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ కిరణ్ కుమార్ అన్నారు. తయారీ ధరకే బంగారం, వజ్రాభరణాలు అందిస్తున్నామన్నారు. ప్రజలు పెద్ద మొత్తంలో తమ కష్టార్జితాన్ని ఆదా చేయవచ్చని, మార్కెట్లోనే ఇతర షోరూంలో లభించని సరికొత్త బంగారు నగల కొనుగోలు పథకంను అందిస్తున్నామన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో లలిత జ్యువెలరీ విశేష ఆదరణ పొందిందని, అన్ని ప్రాంతాల వారికి తక్కువ తరుగు తక్కువ ధరలో నగలు ఇవ్వాలనే ఉద్దేశంతో వినియోగదారుల ఆశీస్సులతో ఈ షో రూమ్ కర్నూల్ లో ప్రారంభించామన్నారు. కర్నూలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ స్థాయిలో ప్రజలు మా ఇతర షోరూమ్ లకు వచ్చి నగలు కొనడం గమనించామని, అందుకే ఇక్కడ కొత్త షోరూమ్ ను ప్రారంభించామని ఆయన వెల్లడించారు.వినియోగదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని లలిత జ్యువెలరీ సరికొత్త ధనవందనం 11 నెలల నగలు కొనుగోలు పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఇందులో నెల నెల కట్టే డబ్బు బంగారం గాను లేక డబ్బు గాను ఆదా చేసుకునే వీలుందన్నారు.ఏ నగ అయినప్పటికీ 50% తరుగు లేదని, అలాగే ఒక నెల ఇన్స్టాల్ మెంట్ లో 50% బోనస్ కలదన్నారు. విస్తృతమైన కలెక్షన్లు మా ప్రత్యేకతలన్నారు. చెయిన్, గాజులు, నెక్లెస్, చోకర్స్, హారం, వంకి,ఒడ్డాణం, ఉంగరాలు, కమ్మలు, జుమ్మిలతోపాటు పలు రకాల నగలు లక్షలాది సంఖ్యలో మా కొత్త షోరూమ్ లో ఉన్నాయన్నారు. తను చాలా పేద కుటుంబంలో జన్మించానని, సాధారణ వ్యక్తికి సరైన ధరలో నగలు కొనడం అనేది ఓ పెద్ద ఛాలెంజ్ అన్న విషయం నాకు తెలుసు అన్నారు. నగల రంగంలో ఉచితాలు, బహుమతులు, డిస్కౌంట్ ల పేర్లతో కస్టమర్లను కన్ఫ్యూజ్ చేస్తుంటారని, ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు విలువ నాకు బాగా తెలుసు కనుకనే కస్టమర్లకు నేను అవగాహన కల్పిస్తుంటానని డాక్టర్ కిరణ్ కుమార్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img