విశాలాంధ్ర, పెద్దకడబూరు :(కర్నూలు) గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలని కస్తూరి బా గాంధీ గురుకుల విద్యాలయం ప్రత్యేక అధికారిణి రుక్సానా పర్వీన్, గ్రంథాలయ అధికారిణి ఆశాజ్యోతి స్పష్టం చేశారు. సోమవారం 56వ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమం పెద్దకడబూరులోని స్థానిక కస్తూరి బా గాంధీ గురుకుల విద్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానానికి భాండాగారాలు అన్నారు. పిల్లలు చిన్నతనం నుంచే గ్రంథాలయంలో చదువుకొని మంచిని అలవరచుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థనీలు పాల్గొన్నారు.