సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి నభి రసూల్
విశాలాంధ్ర -ఆస్పరి : ఈనెల 18వ తేదీన ఆలూరు పట్టణంలో జరుగు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.నబి రసూల్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల సమితి సమావేశాన్ని వ్య.కా.సం. మండల కార్యదర్శి రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నబీ రసూల్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దిలేటి శెట్టి పాల్గొని మాట్లాడుతూ వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న మన రాష్ట్రంలో గ్రామీణ ప్రజలలో అత్యధికులు వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారని వీరిలో గిరిజనులు దళితులు మైనారిటీలు వెనుకబడిన కులాల తదితరులు చెమటోడ్చి కష్టించి పని చేసే శ్రమే దేశ సంపదకు మూలమన్నారు. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో నైజం నవాబు నిరంకుశ పాలనుకు భూస్వామ్యులకు వ్యతిరేకంగా పోరాడి అన్ని రకాల ప్రభుత్వ బంజరు భూములు, మిగులు భూములు కోసం ప్రత్యక్షంగా భూ పోరాటాలు నిర్వహించి లక్షలాది ఎకరాలను పేదలకు పంచిందని, రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని రాష్ట్రంలో రోజురోజుకు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి ఎక్కువైపోయిందని గ్రామీణ ఉపాధి పథకంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల18వ తేదీన ఆలూరులో జరుగు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ కష్టజీవులు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు కోరారు.
అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం నూతన మండల కమిటీని ఏకీగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల గౌరవ అధ్యక్షులుగా బ్రహ్మయ్య, మండల అధ్యక్ష, కార్యదర్శులుగా శివన్న, రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా రామాంజిని, రామిరెడ్డి, ముద్దు రంగయ్య, సహాయ కార్యదర్శిలుగా హరి, నాగేషు, మహానంది, కోశాధికారిగా కృష్ణ తో పాటు 30 మందిని సమితి సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి, సిపిఐ నాయకులు రంగన్న, హమాలి సంఘం అధ్యక్షులు హనుమంతు, నాగేష్, రామాంజిని, శంకరయ్య, రంగప్ప లు పాల్గొన్నారు.