Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

విశాలాంధ్ర ఆస్పరి : మండలంలోని చిరుమాన్ దొడ్డి గ్రామానికి చెందిన బదినేపాటి మహానంది(58) అనే వ్యక్తి విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు ఎస్సై వరప్రసాద్ తెలిపారు. వివరాల మేరకు సోమవారం ఉదయం వెంకటేష్ హోటల్ దగ్గర ఇడ్లీ తీసుకెళ్లడానికి మహానంది రావడం జరిగిందన్నారు. హోటల్ మీద ఉన్న విద్యుత్ తీగలను కోతలు వల్ల తెగిపోవడంతో హోటల్ రేకుల షెడ్డు కు కరెంటు ఆర్త్ అవ్వడం జరిగింది. గమనించని మహానంది హోటల్ రేకల షెడ్డు ఇనుప పైపును పట్టుకోవడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు గ్రామ ప్రజలు, పోలీసులు తెలిపారు. ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, కానిస్టేబుల్ శ్రీనివాసులు తెలిపారు. మృతుడు మహానందికి భార్య జయ్యమ్మ, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు .కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్ షాక్ తో మహానంది మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img