Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

జాతీయ కరాటే పోటీలకు నారాయణ విద్యార్థి ఎంపిక

విశాలాంధ్ర – కర్నూలు సిటీ : స్థానిక మాధవ నగర్ లోని నారాయణ పాఠశాల 6వ తరగతి విద్యార్థి విశ్వేష్ ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ కరాటే పోటీలకు ఎంపికయ్యారనీ నారాయణ స్కూల్స్ ఏజిఎం రమేష్ కుమార్ తెలిపారు. బుధవారం పాటశాలలో ప్రిన్సిపాల్ మహ్మద్ అల్తఫ్ అధ్యక్షతన
ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో విద్యార్ధి విశ్వేష్ ను ఏజిఎం అభినందించారు. ఈ సందర్బంగా ఏజిఎం మాట్లాడుతూ
ప్రతి విద్యార్థికి శారీరక దృఢత్వం ముఖ్యమని అన్నారు. ఇటీవల వైజాక్ లో అండర్ 10 విభాగంలో మూడవ ఏపీ స్టేట్ కరాటే ఛాంపియన్ షిప్ -2023 అధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో విశ్వేష్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించారన్నారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జిల్లా స్థాయిలో బంగారు పతకం సాధించగా , వరుసగా రాష్టస్థ్రాయి లో సైతం బంగారు పతకం సాధించి, వచ్చే నెలలో చండిగర్ లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ ఐ దుర్గాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img