విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఆన్లైన్ పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో మీ కోసం కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనాథ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో చాలా చోట్ల గత ప్రభుత్వం హయాంలో జరిగిన భూ రీసర్వే తప్పుల తడకగా జరిగిందని తెలిపారు. భూమి రిజిస్ట్రేషన్ అయినా కూడా ఆన్లైన్ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాత పద్ధతిలోనే మోటివేషన్ ద్వారా ఆన్లైన్ సౌకర్యం కల్పించాలన్నారు. రైతులు ఇచ్చిన అర్జీలపై తహసీల్దార్ వెంటనే పేద ప్రజల ఆన్లైన్ సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి దస్తగిరి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.